నాపై ట్విట్టర్ వ్యతిరేక ప్రచారం చేస్తోంది: ట్రంప్

ABN , First Publish Date - 2020-08-20T23:51:32+05:30 IST

నాపై ట్విట్టర్ వ్యతిరేక ప్రచారం చేస్తోంది: ట్రంప్

నాపై ట్విట్టర్ వ్యతిరేక ప్రచారం చేస్తోంది: ట్రంప్

వాషింగ్టన్: సోషల్ మీడియాపై తరుచూ విమర్శలు గుప్పించే అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్.. మరోసారి భగ్గుమన్నారు. తనపై ట్విట్టర్ వ్యతిరేక ప్రచారం చేస్తోందని ఆయన ట్విట్టర్‌లోనే ఆరోపించారు. ట్విట్టర్ అమెరికా ట్రెండింగ్‌లో ట్రంప్‌కు వ్యతిరేకంగా అనేక ట్వీట్లు పడుతున్నాయి. ‘‘ట్రంప్ ప్రభావం తరిగిపోయింది’’ అనే హ్యాష్‌ట్యాగ్ ఈరోజు అమెరికా ట్రెండింగ్‌లో ఉంది.


నిజానికి, ట్రంప్‌కు వ్యతిరేకంగా నెటిజెన్లు స్పందించడం ఇది కొత్త కాదు. అయితే ఈ యేడాది అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉండడం వల్ల ఈ వ్యతిరేకత రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంటోంది. మరోవైపు డెమోక్రటిక్ అభ్యర్థి జోయి బిడెన్‌కు నెటిజెన్లలో మద్దతు పెరుగుతుండం ట్రంప్‌కు ఆగ్రహం కలిగించి ఉంటుంది. అందుకే ట్విట్టర్ ట్రెండింగ్‌ను కూడా ట్విట్టర్ ఎగ్జిక్యూటివ్ సృష్టించిన ట్రెండింగ్‌లా ట్రంప్ అభివర్ణించారు.


‘‘ఇది నిజమైన ట్విట్టర్ ట్రెండింగ్ కాదు. ఇది ట్విట్టర్ ఎగ్జిక్యూటివ్ సృష్టించిన ట్రెండింగ్. రిపబ్లికన్ గొంతుకలపై వ్యతిరేకంగా ముఖ్యంగా నాకు వ్యతిరేకంగా ప్రభావం చూపే ట్రెండింగ్’’ అని డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు.

Updated Date - 2020-08-20T23:51:32+05:30 IST