ట్రంప్ న్యాయవాది రూడీకి కొవిడ్ -19 పాజిటివ్
ABN , First Publish Date - 2020-12-07T10:28:45+05:30 IST
డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత న్యాయవాది రూడీ గియులియానికి తాజాగా జరిపిన పరీక్షల్లో కొవిడ్-19 పాజిటివ్ అని తేలింది....

వాషింగ్టన్ (యూఎస్): డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత న్యాయవాది రూడీ గియులియానికి తాజాగా జరిపిన పరీక్షల్లో కొవిడ్-19 పాజిటివ్ అని తేలింది. రూడీ గియులియాని అట్లాంటాలో ముఖానికి మాస్కు ధరించకుండా న్యాయబృందంలోని ఇతర సభ్యులు పలువురితో మాట్లాడుతూ కనిపించారు. న్యూయార్కు గొప్ప మేయరుగా పనిచేసిన గియులియాని అమెరికా ఎన్నికల్లో అక్రమాలపై అక్రమాలను బహిర్గతం చేసేందుకు పోరాడుతూ కరోనా బారిన పడ్డారని ట్రంప్ ట్వీట్ చేశారు. దీంతో రూడీ వారం రోజుల పాటు స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. అమెరికాలో గడచిన 24 గంటల్లో రికార్డుస్థాయిలో కరోనా వైరస్ కేసులు బయటపడ్డాయి.
గతంలో ట్రంప్, అతని భార్య మెలానియా, కుమారుడు డొనాల్డ్ జూనియర్, అతని కుమారుడు బారన్, ప్రెస్ సెక్రటరీ, సలహాదారులు, ప్రచార నిర్వాహకులు కరోనా బారినపడ్డారు. ప్రస్థుతం ట్రంప్ వ్యక్తిగత న్యాయవాదికి కూడా కరోనా సోకింది. గియులియాని వైద్యనిపుణుల సలహాలు పాటించకుండా మాస్కు లేకుండా తిరిగి కరోనా బారిన పడ్డారు. గియులియాని కుమారుడు ఆండ్రూ వైట్ హౌస్ లో పనిచేస్తూ గతంలో కరోనా బారిన పడ్డారు.ట్రంప్ చుట్టూ ఉన్న వారు కరోనా బారిన పడుతున్నారని సీనియర్ సలహాదారు డేవిడ్ గెర్గెన్ చెప్పారు.