అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు కరోనా నెగిటివ్

ABN , First Publish Date - 2020-10-13T11:23:31+05:30 IST

అమెరికా అధినేత ట్రంప్ కరోనా నుంచి బయటపడ్డారు. అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు తాజాగా జరిపిన పరీక్షల్లో కరోనా నెగిటివ్ అని వచ్చింది....

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు కరోనా నెగిటివ్

వాషింగ్టన్ (అమెరికా): అమెరికా అధినేత ట్రంప్ కరోనా నుంచి బయటపడ్డారు. అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు తాజాగా జరిపిన పరీక్షల్లో కరోనా నెగిటివ్ అని తేలింది.ఫ్లోరిడాలో ప్రచార ర్యాలీకి ముందు ట్రంప్ కు కరోనా నెగిటివ్ అని వచ్చిందని వైట్ హౌస్ వైద్యుడు సీన్ కోన్లీ చెప్పారు.యాంటీజెన్ కార్డును ఉపయోగించి ట్రంప్ కు చేసిన కరోనా పరీక్ష నెగిటివ్ ఫలితాన్ని డాక్టర్ సీన్ కోన్లీ, ప్రెసిడెంట్ ప్రెస్ సెక్రటరీ మెక్ ఎననీలు పంచుకున్నారు. గత వారం ట్రంప్ వాల్టర్ రీడ్ నేషనల్ మిలటరీ మెడికల్ సెంటరులో చికిత్స పొంది వైట్ హౌస్‌కు తిరిగివచ్చారు.


ట్రంప్ కు కరోనా యాంటీజెన్ పరీక్షలతో పాటు వైరల్ లోడ్ ఆర్ఎన్ఎ, పీసీఆర్ ప్రవేశ కొలతలతో సహా క్లినికల్, ప్రయోగశాల డేటాతో పోల్చగా కరోనా వైరస్ ప్రభావం లేదని సూచించిందని వైద్యులు చెప్పారు. అంతకు ముందు ట్రంప్ సండే మార్నింగ్ ఫ్యూచర్సు హౌస్ట్ బార్టిరోమోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు కరోనా వైరస్ బారి నుంచి రోగనిరోధక శక్తి లభించిందని చెప్పారు. తనకు రోగనిరోధక శక్తి ఉన్నందున తాను హోం క్వారంటైన్ నుంచి బయటకు వెళ్లగలనని ట్రంప్ పేర్కొన్నారు. 

Updated Date - 2020-10-13T11:23:31+05:30 IST