ఉయిగర్లకు మద్దతుగా బిల్లుపై ట్రంప్‌ సంతకం

ABN , First Publish Date - 2020-06-19T08:10:18+05:30 IST

చైనాలోని ఉయిగర్‌ సముదాయం, ఇతర ముస్లిం వర్గాలకు మద్దతుగా వారిపై జరుగుతున్న దాష్టీకాలపై అమెరికా కఠిన వైఖరి తీసుకుంది. షిన్‌జియాంగ్‌ ప్రాంతంలో ఉయిగర్‌ ముస్లిం మైనారిటీ...

ఉయిగర్లకు మద్దతుగా బిల్లుపై ట్రంప్‌ సంతకం

  • అమెరికా ఫలితం అనుభవించక తప్పదు: చైనా 


వాషింగ్టన్‌, జూన్‌ 18: చైనాలోని ఉయిగర్‌ సముదాయం, ఇతర ముస్లిం వర్గాలకు మద్దతుగా వారిపై జరుగుతున్న దాష్టీకాలపై అమెరికా కఠిన వైఖరి తీసుకుంది. షిన్‌జియాంగ్‌ ప్రాంతంలో ఉయిగర్‌ ముస్లిం మైనారిటీ బృందాలకు సంబంధించిన ఓ బిల్లుపై అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంతకం చేశారు.  ‘ది ఉయిగర్‌ హ్యూమన్‌ రైట్స్‌ పాలసీ యాక్ట్‌-2020’ బిల్లు ద్వారా షిన్‌జియాంగ్‌లో ఉయిగర్ల పట్ల మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడిన చైనాకు చెందిన సీనియర్‌ అధికారులపై ఆంక్షలు విధించడానికి మార్గం సుగమం అయింది.  ఈ బిల్లుపై ట్రంప్‌ సంతకం చేయడాన్ని ఉయిగర్‌ మానవహక్కుల ప్రాజెక్టు (యూహెచ్‌ఆర్పీ) స్వాగతించింది. ప్రపంచవ్యాప్తంగా ఉయిగర్లు సంబరాలు చేసుకుంటున్నారని యూహెచ్‌ఆర్సీ  ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఒమర్‌ కానట్‌ చెప్పారు. దానిపై ట్రంప్‌ సంతకం చేయడాన్ని చైనా తీవ్రంగా ఆక్షేపించింది. ఇందుకు ఫలితాన్ని అమెరికా అనుభవించక తప్పదని  హెచ్చరించింది.


Updated Date - 2020-06-19T08:10:18+05:30 IST