ఏం జనాలు.. ఏం ఆతిథ్యం..!: ట్రంప్‌

ABN , First Publish Date - 2020-03-02T08:16:25+05:30 IST

‘‘ఏం జనాలు.. ఏం ఆతిథ్యం.. భారతీయులు నన్ను ఉక్కిరిబిక్కిరి చేశారు. వారి ఆతిథ్యానికి పరవశించిపోయాను’’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన భారత పర్యటనపై అమితానందం ...

ఏం జనాలు.. ఏం ఆతిథ్యం..!: ట్రంప్‌

వాషింగ్టన్‌, మార్చి 1: ‘‘ఏం జనాలు.. ఏం ఆతిథ్యం.. భారతీయులు నన్ను ఉక్కిరిబిక్కిరి చేశారు. వారి ఆతిథ్యానికి పరవశించిపోయాను’’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన భారత పర్యటనపై అమితానందం వ్యక్తం చేశారు. సౌత్‌ కరోలినాలో ర్యాలీని ఉద్దేశించి మాట్లాడిన ట్రంప్‌.. భారత ప్రధాని మోదీని కొనియాడకుండా ఉండలేనన్నారు. అహ్మదాబాద్‌లోని మొతేరా మైదానంలో జరిగిన ‘నమస్తే ట్రంప్‌’ కార్యక్రమంలో తనకు లభించిన స్వాగతం నభూతో.. అన్న విధంగా సాగిందని, లక్షన్న ర మంది తనకు స్వాగతం పలికిన తీరు అబ్బురపరిచిందని హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీని గొప్ప వ్యక్తిగా పేర్కొన్న ట్రంప్‌ ఆయనతో వేదిక పంచుకోవడం చిరస్మరణీయమని, భారతీయులు ఆయనను అమితంగా ప్రేమిస్తారని అన్నారు. గత నెల 24, 25 తేదీల్లో భారత్‌లో కుటుంబ సమేతంగా పర్యటించిన ట్రంప్‌.. ఆ పర్యటన తన మనసులో చెరగని ముద్ర వేసిందని అమెరికన్లకు వివరించారు.

Updated Date - 2020-03-02T08:16:25+05:30 IST