ట్రంప్ నిర్ణయం స్వార్థపూరితం.. మండిపడ్డ రష్యా

ABN , First Publish Date - 2020-04-15T22:56:03+05:30 IST

కరోనాపై పోరు కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో)కు ఇచ్చే నిధులను అగ్రరాజ్యం అమెరికా నిలిపివేసింది.

ట్రంప్ నిర్ణయం స్వార్థపూరితం.. మండిపడ్డ రష్యా

మాస్కో: కరోనాపై పోరు కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో)కు ఇచ్చే నిధులను అగ్రరాజ్యం అమెరికా నిలిపివేసింది. డబ్ల్యూహెచ్‌వోకు కొత్తగా ఎటువంటి నిధులు పంపేది లేదని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చిచెప్పారు. ఈ నిర్ణయాన్ని రష్యా తప్పుబట్టింది. కరోనాపై పోరులో ప్రపంచం మొత్తం నాయకత్వం కోసం డబ్ల్యూహెచ్‌వోవైపే చూస్తోందని, అమెరికా తీసుకున్న నిర్ణయం ఈ సంస్థను దెబ్బతీస్తుందని విమర్శించింది. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం.. అత్యంత స్వార్ధపూరితమైందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గేయ్ ర్యాబ్‌కోవ్ మండిపడ్డారు. అమెరికా నిర్ణయం ఆందోళన కలిగిస్తోందని, మిగతా దేశాలు కూడా అదే మార్గంలో నడిస్తే చాలా ప్రమాదమని ఆందోళన వ్యక్తంచేశారు. కాగా, ఇంతకాలం డబ్ల్యూహెచ్‌వోకు సమకూరే నిధుల్లో సింహభాగం అమెరికా నుంచే అందేవి.

Updated Date - 2020-04-15T22:56:03+05:30 IST