ట్రంప్ ఆరోపణ శుద్ద అబద్దం.. ప్రధాని ఆగ్రహం!

ABN , First Publish Date - 2020-08-19T03:05:27+05:30 IST

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. న్యూజిలాండ్‌లో కరోనా వ్యాప్తిపై ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.

ట్రంప్ ఆరోపణ శుద్ద అబద్దం.. ప్రధాని ఆగ్రహం!

ఆక్లాండ్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. న్యూజిలాండ్‌లో కరోనా వ్యాప్తిపై ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఓ ప్రెస్ మీట్‌లో మాట్లాడిన ట్రంప్.. న్యూజిలాండ్‌లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై న్యూజిలాండ్ ప్రధాని జకిండా అర్డెన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ట్రంప్ ఆరోపణలు శుద్ధ అబద్ధాలని తేల్చిచెప్పారు. ‘న్యూజిలాండ్‌లో రోజుకు తొమ్మిది కేసులు వస్తున్నాయి. అమెరికాలో ప్రతిరోజూ వేలసంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. న్యూజిలాండ్‌లో నమోదవుతున్న కరోనా కేసులను అమెరికాతో ఎలా పోలుస్తాం?’ అని ఆమె బదులిచ్చారు. కాగా, ఇప్పటి వరకూ న్యూజిలాండ్‌లో కేవలం 1,643 కరోనా కేసులు, 22 మరణాలు నమోదయ్యాయి.

Updated Date - 2020-08-19T03:05:27+05:30 IST