తృణమూల్, బీజేపీ మధ్య మళ్లీ ఘర్షణ

ABN , First Publish Date - 2020-12-26T18:38:25+05:30 IST

తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలకు మధ్య మళ్లీ ఘర్షణ చెలరేగింది. సాక్షాత్తూ పోలీసుల ముందే చెలరేగిపోయారు. తృణమూల్ నుంచి

తృణమూల్, బీజేపీ మధ్య మళ్లీ ఘర్షణ

కోల్‌కతా : తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలకు మధ్య మళ్లీ ఘర్షణ చెలరేగింది. సాక్షాత్తూ పోలీసుల ముందే చెలరేగిపోయారు. తృణమూల్ నుంచి కొన్ని రోజుల క్రిందటే బీజేపీలో చేరిన రెబెల్ ఎంపీ సునీల్ మోండల్ బీజేపీ కార్యాలయానికి వచ్చారు. ఈ సమయంలో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన కారును చుట్టుముడుతూ నినాదాలు చేశారు. ఈ టెన్షన్ దాదాపు అరగంట పాటూ కొనసాగింది. దీంతో బీజేపీ కార్యాలయం ముందు టెన్షన్ వాతావరణం నెలకొంది. బీజేపీ కార్యాలయం ముందు పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసినా... వాటిని తోసుకొని మరీ తృణమూల్ కార్యకర్తలు తమ నిరసనను వ్యక్తం చేశారు. అప్పటికప్పుడు తృణమూల్ కార్యకర్తలు బీజేపీ కార్యాలయం ముందు ఓ స్టేజీని ఏర్పాటు చేసుకొని, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలివ్వడం ప్రారంభించారు. అయితే ఈ నిరసన అప్పటికప్పుడు అనుకొనే చేశామని, ఇందులో ముందస్తు వ్యూహం లేదని తృణమూల్ ఎంపీ సౌగతా రాయ్ తెలిపారు. 

Updated Date - 2020-12-26T18:38:25+05:30 IST