తృణమూల్‌ ఎమ్మెల్యే ఘోష్‌ మృతి

ABN , First Publish Date - 2020-06-25T06:57:21+05:30 IST

పశ్చిమబెంగాల్‌లో కరోనాతో చికిత్స పొందుతూ అధికార పార్టీ ఎమ్మెల్యే తమోనష్‌ ఘోష్‌ (60) మృతిచెందారు. ఈయన దక్షిణ 24పరగణాల జిల్లాలోని ఫాల్టా అసెంబ్లీ స్థానం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు...

తృణమూల్‌ ఎమ్మెల్యే ఘోష్‌ మృతి

పశ్చిమబెంగాల్‌లో  కరోనాతో చికిత్స పొందుతూ అధికార పార్టీ ఎమ్మెల్యే తమోనష్‌ ఘోష్‌ (60) మృతిచెందారు. ఈయన దక్షిణ 24పరగణాల జిల్లాలోని ఫాల్టా అసెంబ్లీ స్థానం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత నెలలో ఆయనకు  పరీక్షలు నిర్వహిస్తే పాజిటివ్‌ వచ్చింది. ఆయన మృతిపట్ల సీఎం మమతా బెనర్జీ, గవర్నర్‌ జగ్దీప్‌ ధన్‌కర్‌ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరోనా ఉధృతి నేపథ్యంలో అఖిల పక్ష సమావేశాన్ని సీఎం మమత ఏర్పాటు చేసి చర్చించారు. జూలై 31 వరకు లాక్‌డౌన్‌ పొడిగించాలని నిర్ణయించారు. కాగా ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 14,728 పాజిటివ్‌లు నమోదుకాగా 580 మంది మరణించారు. 4,930 మంది చికిత్స పొందుతుండగా 9,218 మంది కోలుకున్నారు. 


Updated Date - 2020-06-25T06:57:21+05:30 IST