‘గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్ అభియాన్’ బెంగాల్‌కు వర్తించదా? టీఎంసీ

ABN , First Publish Date - 2020-06-22T22:22:35+05:30 IST

వలస కార్మికుల నిమిత్తమై కేంద్రం ప్రకటించిన ‘గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్ అభియాన్’ కింద బెంగాల్‌ను కేంద్రం

‘గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్ అభియాన్’ బెంగాల్‌కు వర్తించదా? టీఎంసీ

కోల్‌కతా : వలస కార్మికుల నిమిత్తమై కేంద్రం ప్రకటించిన ‘గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్ అభియాన్’ కింద బెంగాల్‌ను కేంద్రం విస్మరించిందని తృణమూల్ నేత అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. లాక్‌డౌన్ సమయంలో వివిధ రాష్ట్రాల నుంచి బెంగాల్‌కు తిరిగి వచ్చిన 11 లక్షల మంది వలస కార్మికులను ఈ పథకం కింద ఎందుకు పక్కకు పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు.


ఈ పథకం కింద ఆరు రాష్ట్రాల నుంచి 116 జిల్లాలను గుర్తించారని అయితే బెంగాల్ లోని జిల్లాలను ఎందుకు విస్మరించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘లాక్‌డౌన్ కారణంగా చాలా మంది వలస కార్మికులు బెంగాల్‌కు తిరిగివచ్చారు. అయినా సరే కేంద్రం బెంగాల్‌ను ఎందుకు విస్మరించారు? గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్ అభియాన్ కింద బెంగాల్‌ను ఎందుకు విస్మరించారు? బెంగాల్‌ ప్రజలపై ఉదాసీనత ఎందుకు?’’ అని అభిషేక్ సూటిగా ప్రశ్నించారు. 

Updated Date - 2020-06-22T22:22:35+05:30 IST