త్రివర్ణ పతాకం ఆవిష్కరణ వార్షికోత్సవాలు... నేతాజీని స్మరించిన మోదీ...

ABN , First Publish Date - 2020-12-30T22:08:16+05:30 IST

త్రివర్ణ పతాకం ఆవిష్కరణ వార్షికోత్సవాల సందర్భంగా ప్రధాన మంత్రి

త్రివర్ణ పతాకం ఆవిష్కరణ వార్షికోత్సవాలు... నేతాజీని స్మరించిన మోదీ...

న్యూఢిల్లీ : త్రివర్ణ పతాకం ఆవిష్కరణ వార్షికోత్సవాల సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం నేతాజీ సుభాశ్ చంద్రబోస్‌ను స్మరించారు. 1943 డిసెంబరు 30న పోర్ట్ బ్లెయిర్‌లో నేతాజీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారన్నారు. ఈ ఘట్టం ప్రతి భారతీయుడి మదిలోనూ చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. 


మోదీ బుధవారం ఇచ్చిన ట్వీట్‌లో, ధైర్యసాహసాలుగల నేతాజీ సుభాశ్ చంద్రబోస్ 1943 డిసెంబరు 30న పోర్ట్ బ్లెయిర్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారని పేర్కొన్నారు. త్రివర్ణ పతాకావిష్కరణ 75వ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ఈ రోజు చాలా ప్రత్యేకమైనదని తెలిపారు. తాను పోర్ట్ బ్లెయిర్ వెళ్ళానని, అక్కడ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం గౌరవ కారణమని తెలిపారు. ఆ తీపి గుర్తులను పంచుకుంటున్నట్లు పేర్కొంటూ, ఓ ఫొటోను జత చేశారు. 


నేతాజీ సుభాశ్ చంద్రబోస్ ఒడిశాలోని కటక్‌లో 1897 జనవరి 23న జన్మించారు. ఆయన తండ్రి జానకీనాథ్ బోస్ న్యాయవాద వృత్తిని నిర్వహించేవారు. నేతాజీ స్వాతంత్ర్య సంగ్రామంలో వీరోచితంగా పోరాడారు. ఆజాద్ హింద్ ఫౌజ్‌ను స్థాపించి, స్వాతంత్ర్యం కోసం పోరాడారు. 


Updated Date - 2020-12-30T22:08:16+05:30 IST