120 కి.మీ వేగంతో రైలు ట్రయన్‌ రన్‌

ABN , First Publish Date - 2020-08-01T15:10:37+05:30 IST

120 కి.మీ వేగంతో రైలు ట్రయన్‌ రన్‌

120 కి.మీ వేగంతో రైలు ట్రయన్‌ రన్‌

చెన్నై: తమిళనాడులోని పొల్లాచ్చి రైలు మార్గంలో రెండోసారి 120 కి.మీ వేగంతో రైల్‌ ట్రయల్‌ రన్‌ జరిగింది. కోయంబత్తూర్‌ నుంచి ఉదయం 8 గంటలకు బయల్దేరిన రైలు పోతనూరు-కినత్తుకడవు మధ్య 120 కి.మీ వేగం తగ్గకుండా నడిపి, రైలుపట్టాల ప్రకంపనలు  అందులో ప్రయాణించిన ఇంజనీర్లు పరిశీలించారు. అనంతరం పొల్లాచ్చి నుంచి పాలక్కాడు మార్గంలో కూడా ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. పొల్లాచ్చి-పాలక్కాడు, పోతనూరు- కినత్తుకడవు మార్గాల్లో రెండు సార్లు చేపట్టిన ట్రయల్‌ రన్‌ విజయవంతమైనట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2020-08-01T15:10:37+05:30 IST