కొండ రైలు మార్గం మరమ్మతులు ప్రారంభం

ABN , First Publish Date - 2020-05-10T11:55:19+05:30 IST

కున్నూరు రైలుమార్గంలో మరమ్మతులు ప్రారంభమయ్యాయి. కోయంబత్తూర్‌ జిల్లా మేట్టుపాళయం నుంచి ఊటీ వెళ్లే నీలగిరి కొండ రైల్లో ప్రయాణించడానికి పర్యాటకులు ఆసక్తి చూపుతుంటారు.

కొండ రైలు మార్గం మరమ్మతులు ప్రారంభం

చెన్నై: కున్నూరు రైలుమార్గంలో మరమ్మతులు ప్రారంభమయ్యాయి. కోయంబత్తూర్‌ జిల్లా మేట్టుపాళయం నుంచి ఊటీ వెళ్లే నీలగిరి కొండ రైల్లో ప్రయాణించడానికి పర్యాటకులు ఆసక్తి చూపుతుంటారు. కరోనా కారణంగా  మార్చి 18వ తేదీ నుంచి కొండ రైలు సేవలు నిలిపివేశారు. ఈ నేపథ్యంలో 50 రోజుల అనంతరం ఆ మార్గంలో మరమ్మతులు ప్రారంభమయ్యాయి. కున్నూరు గ్యారేజీ నుంచి గూడ్సు రైలులో ఎక్స్‌కవేటర్లను తీసుకెళ్లి రైలుపట్టాల సమీపంలో కొండపై నుంచి జారిపడిన రాళ్లు, మట్టిని తొలగించి మరమ్మతులు చేపడుతున్నారు. అనుమతులు వచ్చిన వెంటనే కొండ రైలును నడుపుతామని అధికారులు తెలిపారు.

Updated Date - 2020-05-10T11:55:19+05:30 IST