ట్రాయ్ కొత్త నిబంధనలు, టీవి ప్రేక్షకులకు తీపి కబురు!

ABN , First Publish Date - 2020-03-08T23:30:34+05:30 IST

టీవీ ప్రేక్షకులకు ఊరటనిస్తూ ట్రాయ్ ప్రకటించిన కొత్త విధానం మార్చి 1 నుంచి అమల్లోకి వచ్చింది. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

ట్రాయ్ కొత్త నిబంధనలు, టీవి ప్రేక్షకులకు తీపి కబురు!

న్యూఢిల్లీ: టీవీ ప్రేక్షకులకు ఊరటనిస్తూ ట్రాయ్ ప్రకటించిన కొత్త విధానం మార్చి 1 నుంచి అమల్లోకి వచ్చింది. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కొత్త విధానం ప్రకారం రూ. 130 నెలకు చెల్లిస్తే 200 ఉచిత చానళ్లు ఎంచుకోవచ్చు. పాత విధానంలో 100 ఉచిత ఛానల్స్‌ అందుబాటులో ఉండేవి. 100 దాటిన తరువాత ఉచిత చానల్స్ కావాలని అడిగిన వినియోగదారుల నుంచి ప్రతి 25 ఛానళ్లకు 25 రూపాయలతో పాటూ జీఎస్‌టీని అదనంగా వసూలు చేసేవారు. అయితే తాజా విధానంలో ప్రేక్షకులకు 200 చానల్స్ ఉచితంగా అందిస్తున్నారు.  ఇందులో మరో ప్రధానమైన అంశం.. గరిష్టంగా ఒక ఛానల్ ధర రూ. 19 ఉండగా దానిని రూ. 12కి తగ్గించారు. ఆ ప్రకారం బొకేలో రూ. 12లోపు ధర ఉన్నవాటినే చేర్చాల్సి ఉంటుంది. ఒకే ఇంట్లో రెండు కనెక్షన్‌లు ఉంటే రెండో కనెక్షన్‌కు నెట్‌వర్క్ క్యారియర్ ఫీజులో 40 శాతం చార్జీనే వసూలు చేయాలి.  అంతే కాకుండా.. వినియోగదారుడు ఎంచుకున్న ఛానళ్లను ఎంఎస్‌వోలు, లోకల్ కేబుల్ ఆపరేటర్లు తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది. ఏబీఎస్ ఆంధ్రజ్యోతి సహా తాము కోరుకున్న ఏ ఛానల్‌ అయినా ప్రేక్షకులు చూడలేకపోతే వేంటనే వారు ట్రాయ్‌కు ఫిర్యాదు చేయడం ద్వారా తమ అభిమాన ఛానల్‌ను తిరిగి పొందవచ్చు. 

Updated Date - 2020-03-08T23:30:34+05:30 IST