కాన్ఫరెన్స్ కాల్స్‌తో జాగ్రత్త.. ట్రాయ్ హెచ్చరిక..

ABN , First Publish Date - 2020-05-11T23:15:14+05:30 IST

ఆన్‌లైన్ కాన్ఫరెన్సింగ్ యాప్‌లను వినియోగించేటప్పుడు ప్రజలు జాగ్రత్తలు పాటించాలని భారత టెలీకాం..

కాన్ఫరెన్స్ కాల్స్‌తో జాగ్రత్త.. ట్రాయ్ హెచ్చరిక..

న్యూఢిల్లీ: ఆన్‌లైన్ కాన్ఫరెన్సింగ్ యాప్‌లను వినియోగించేటప్పుడు ప్రజలు జాగ్రత్తలు పాటించాలని భారత టెలీకాం నియంత్రణ మండలి (ట్రాయ్) హెచ్చరించింది. అధిక బిల్లులు రాకుండా అప్రమత్తంగా వ్యవహరించాలంటూ సూచించింది. ‘‘ఆన్‌లైన్ కాన్ఫరెన్సింగ్ యాప్‌లను ఉపయోగించే వారు అనుకోకుండా అంతర్జాతీయ నంబర్లకు కాల్ చేయడం వల్ల.. వినియోగదారులకు పెద్దమొత్తంలో బిల్లులు వచ్చినట్టు ట్రాయ్ దృష్టికి వచ్చింది. కస్టమర్ కేర్ సెంటర్ల కోసం అలాంటి కొన్ని యాప్‌లు ప్రిమీయం నంబర్లు లేదా అంతర్జాతీయ నంబర్లు ఇస్తున్నట్టు కూడా మేం గుర్తించాం...’’ అని ట్రాయ్ పేర్కొంది. ఈ యాప్‌ల ద్వారా పొరపాటున అంతర్జాతీయన నంబర్లకు ఫోన్ చేస్తే ఐఎస్‌డీ టారిఫ్‌ల ప్రకారం చార్జీలు చెల్లించాల్సి ఉంటుందని గుర్తుచేసింది. అందువల్ల అలాంటి యాప్‌ల ద్వారా డైల్-ఇన్ సర్వీసులు ఉపయోగించే ముందు అన్ని నియమ నిబంధనలు, వాయిస్ కాల్స్ చార్జీలు, ఇతర చార్జీలను పరిశీలించాలని ట్రాయ్ సూచించింది. 

Updated Date - 2020-05-11T23:15:14+05:30 IST