వినియోగదారులు పెరిగినా ఉపయోగం లేకుండా పోతోంది: వాపోయిన ఫేస్‌బుక్
ABN , First Publish Date - 2020-03-25T20:52:05+05:30 IST
ప్రధాన సామాజిక మాధ్యమమైన ఫేస్‌బుక్‌కు సహజంగానే వినియోగ దారుల తాకిడి ఎక్కువైంది. కానీ ఇది సదరు సంస్థకు ఆశించిన ఫలితాలను ఇవ్వటం లేదు.

న్యూఢిల్లీ: లాక్ డౌన్ కారణంగా ఇండియా మొత్తం ఇళ్లలోనే ఉంది. సమన్వయం కోసం అందరూ సోషల్ మీడియా మీదే ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన సామాజిక మాధ్యమమైన ఫేస్‌బుక్‌కు సహజంగానే వినియోగ దారుల తాకిడి ఎక్కువైంది. కానీ ఇది సదరు సంస్థకు ఆశించిన ఫలితాలను ఇవ్వటం లేదు. ఆదాయంలో ఆశించిన వృద్ధి కనిపించట్లేదు. ఈ విషయాన్ని ఫేస్ బుక్ స్వయంగా ప్రకటించింది. కరోనా నిబంధనల నేపథ్యంలో ఫేస్‌బుక్ అందిస్తున్న మెసేజింగ్, ఇతర సర్వీసులకు డిమాండ్ పెరిగింది కానీ వాటి ద్వారా అడ్వటైజ్‌మెంట్ల ఆదాయం ఉండదని తెలిపింది. మరోవైపు.. కఠిన ఆంక్షలు విధిస్తున్న దేశాల నుంచి యాడ్ రాక..ఆదాయం తగ్గిందని తెలిపింది.