దేశంలో మొత్తం 28 కరోనా కేసులు.. ప్రకటించిన కేంద్ర మంత్రి

ABN , First Publish Date - 2020-03-04T21:39:36+05:30 IST

భారత దేశంలో మొత్తం 28 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు.

దేశంలో మొత్తం 28 కరోనా కేసులు.. ప్రకటించిన కేంద్ర మంత్రి

న్యూఢిల్లీ: భారత దేశంలో మొత్తం 28 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వివరాలను తెలియజేశారు. ఈ 28 కేసుల్లో మూడు కేరళ రాష్ట్రంలో నమోదయ్యాయని, అయితే సదరు పేషెంట్లను చికిత్స అనంతరం డిశ్చార్జి చేశామని ఆయన తెలిపారు. కేరళకు చెందిన ముగ్గురు కరోనా పేషెంట్లు కోలుకున్నారని, అందుకే వారిని డిశ్చార్జి చేశామని స్పష్టంచేశారు. ఈ 28 మంది కరోనా పీడితుల్లో 14మంది ఇటలీ దేశస్థులని చెప్పారు. వీరందరినీ చావ్లా ప్రాంతంలోని ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ)కి చెందిన ఐసోలేటెడ్ ఫెసిలిటీకి తరలించామన్నారు. మొత్తం 21మంది ఇటలీవాసులకు కరోనా పరీక్షలు చేయగా, వారిలో 14మందికి పాజిటివ్ ఫలితాలొచ్చాయని తెలిపారు.

Updated Date - 2020-03-04T21:39:36+05:30 IST