రైతులకు కేంద్ర వ్యవసాయ మంత్రి లేఖ

ABN , First Publish Date - 2020-12-18T00:12:18+05:30 IST

వాస్తవానికి కనీస మద్దతు ధరపై లిఖితపూర్వక హామీ ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ రైతులు మాత్రం మూడు వ్యవసాయ బిల్లుల్ని పూర్తిగా ఉపసంహరించుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.

రైతులకు కేంద్ర వ్యవసాయ మంత్రి లేఖ

న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, రైతులకు లేఖ రాశారు. కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)పై కొంత మంది చెప్పే అబద్దాలు ప్రచారం చేస్తున్నారని, వాటిని నమ్మొద్దని ఆ లేఖలో రైతులకు విజ్ణప్తి చేశారు. అంతే కాకుండా ఎంఎస్‌పీపై ప్రభుత్వం లిఖితపూర్వకమైన హామీ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన రాసుకొచ్చారు.


‘‘కొన్ని రైతులు సంఘాలు తప్పుడు ప్రచారం, రూమర్లను ప్రచారం చేస్తున్నాయి. అలాంటి వారిని బయటికి పంపడం వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినందుకు నా బాధ్యత. వాళ్లు రైలు పట్టాలపై కూర్చొని రైళ్లను ఆపుతున్నారు. దాని ద్వారా మన సైనికులు సరిహద్దుకు చేరుకోలేకపోతున్నారు’’ అని రైతులకు రాసిన లేఖలో తోమర్ పేర్కొన్నారు.


వాస్తవానికి కనీస మద్దతు ధరపై లిఖితపూర్వక హామీ ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ రైతులు మాత్రం మూడు వ్యవసాయ బిల్లుల్ని పూర్తిగా ఉపసంహరించుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. పలు దఫాలు రైతులతో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు చర్చలు జరిపినప్పటికీ ఫలితం లేకపోయింది.

Updated Date - 2020-12-18T00:12:18+05:30 IST