వ్యాక్సిన్‌కు.. అతని ఆరోగ్య సమస్యకు
ABN , First Publish Date - 2020-12-03T08:27:48+05:30 IST
ఆక్స్ఫర్డ్ వర్సిటీ కరోనా వ్యాక్సిన్ ‘కొవిషీల్డ్’ వేయించుకున్న తర్వాతే తీవ్ర నాడీ సమస్యలు తలెత్తాయంటూ చెన్నైకు చెందిన ఒక వలంటీర్ చేసిన ఫిర్యాదును డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) తిరస్కరించింది.
సంబంధం లేదు : డీసీజీఐ
న్యూఢిల్లీ, డిసెంబరు 2 : ఆక్స్ఫర్డ్ వర్సిటీ కరోనా వ్యాక్సిన్ ‘కొవిషీల్డ్’ వేయించుకున్న తర్వాతే తీవ్ర నాడీ సమస్యలు తలెత్తాయంటూ చెన్నైకు చెందిన ఒక వలంటీర్ చేసిన ఫిర్యాదును డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) తిరస్కరించింది. అతడిలో తలెత్తిన నాడీ సమస్యలకు, వ్యాక్సిన్ డోసుకు సంబంధం లేదని తేల్చి చెప్పింది. వైద్య నిపుణులతో కూడిన స్వతంత్ర దర్యాప్తు కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయానికి వచ్చినట్లు డీసీజీఐ తెలిపింది. వలంటీర్‌కు పరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదని కమిటీ సూచించినట్లు పేర్కొంది.