చేతులు శుభ్రం చేసుకునేందుకు

ABN , First Publish Date - 2020-04-21T10:28:04+05:30 IST

ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) సిఫారసు చేసిన రెండు రకాల ఆల్కాహాల్‌ మిళిత క్రిమిసంహారకాలు కరోనా వైరస్‌

చేతులు శుభ్రం చేసుకునేందుకు

ఆ రెండూ ఉత్తమం: శాస్త్రవేత్తలు


బెర్లిన్‌, ఏప్రిల్‌ 20 : ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) సిఫారసు చేసిన రెండు రకాల ఆల్కాహాల్‌ మిళిత క్రిమిసంహారకాలు కరోనా వైరస్‌ కట్టడిలో ప్రభావవంతంగా పనిచేస్తాయని జర్మనీ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. ఇవి చేతులను శుభ్రం చేసుకునేందుకు బాగా ఉపయోగపడతాయని, 30 సెకన్లలోనే కొవిడ్‌-19ను నిర్వీర్యం చేయగలవని ప్రయోగ పరీక్షల్లో గుర్తించారు. ఔషధ కంపెనీలు వాటిని తయారు చేయడం కూడా చాలా సులువని శాస్త్రవేత్తలు అంటున్నారు. డబ్ల్యూహెచ్‌వో సూచించిన మొదటి రకం ఆల్కాహాల్‌ మిళిత క్రిమిసంహారకం తయారీకి 80 వాల్యూమ్‌ పర్సెంట్‌(వీపీ) ఇథనాల్‌, 1.45 వీపీ గ్లిజరిన్‌, 0.125 వీపీ హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ వాడతారు. ఇక రెండో రకం దానిలో 75 పీవీ ఐసోప్రోపనోల్‌, 1.45 వీపీ గ్లిజరిన్‌, 0.125 వీపీ హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ సమ్మేళనాలు ఉంటాయి. 

Updated Date - 2020-04-21T10:28:04+05:30 IST