కరోనా ఎఫెక్ట్: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం

ABN , First Publish Date - 2020-03-17T01:58:50+05:30 IST

దేశాన్ని కరోనా వైరస్ గడగడలాడిస్తోంది. దాదాపు 15 రాష్ట్రాల్లో 100కుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి.

కరోనా ఎఫెక్ట్: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం

చెన్నై: దేశాన్ని కరోనా వైరస్ గడగడలాడిస్తోంది. దాదాపు 15 రాష్ట్రాల్లో 100కుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజిలు, యూనివర్సిటీలను 31 వరకు మూసివేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అలాగే స్విమ్మింగ్ పూల్స్, మాల్స్ వంటి వాటిని కూడా మూసివేయాలని, ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసే సదుపాయం కల్పించాలని కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ చెప్పారు. కాగా, ఇదే సమయంలో తమిళనాడు ప్రభుత్వం కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని స్కూళ్లు, కాలేజీలు, సినిమా థియేటర్లు, మాల్స్, అమ్యూజ్‌మెంట్ పార్కులు, స్విమ్మింగ్ పూల్స్, జిమ్స్, జూ, మ్యూజియంలు, కల్యాణ మండపాలు, స్టేడియాలు, క్లబ్బులు, బార్లు అన్నింటినీ మూసేయాలని ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలని, ఈ నెల 31 వరకు పైన పేర్కొన్న సదుపాయాలను మూసే ఉంచాలని స్పష్టంచేసింది.

Updated Date - 2020-03-17T01:58:50+05:30 IST