‘బీజేపీ ఛీ ఛీ’ పేరుతో మమత బెనర్జీ కొత్త కార్యక్రమం

ABN , First Publish Date - 2020-03-05T02:01:58+05:30 IST

ఢిల్లీలో జరిగిన మారణ హోమానికి వ్యతిరేకంగా శుక్రవారం నాడు రాష్ట్రంలోని ప్రతి బ్లాక్ ‘బీజేపీ ఛీ ఛీ’ కార్యక్రమంతో నినదించాలి. నిజానికి ఇది బీజేపీ కుట్రలో భాగం. కానీ అల్లర్లుగా రూపు మార్చారు. అమాయక ప్రజలను చంపడానికి బయటి నుంచి రౌడీలను తీసుకువచ్చారు. ఈ మారణ హోమానికి బీజేపీదే పూర్తి బాధ్యత

‘బీజేపీ ఛీ ఛీ’ పేరుతో మమత బెనర్జీ కొత్త కార్యక్రమం

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో భారతీయ జనతా పార్టీ ఆగమనాన్ని నిలువరించేందుకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కొత్త వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఢిల్లీలో జరిగిన మారణ హోమానికి వ్యతిరేకంగా ‘బీజేపీ ఛీ ఛీ’ (బీజేపీ సిగ్గు సిగ్గు) అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ పేర్కొన్నారు.


‘‘ఢిల్లీలో జరిగిన మారణ హోమానికి వ్యతిరేకంగా శుక్రవారం నాడు రాష్ట్రంలోని ప్రతి బ్లాక్ ‘బీజేపీ ఛీ ఛీ’ కార్యక్రమంతో నినదించాలి. నిజానికి ఇది బీజేపీ కుట్రలో భాగం. కానీ అల్లర్లుగా రూపు మార్చారు. అమాయక ప్రజలను చంపడానికి బయటి నుంచి రౌడీలను తీసుకువచ్చారు. ఈ మారణ హోమానికి బీజేపీదే పూర్తి బాధ్యత. శుక్రవారం నాడు దేశానికి ఇదే విషయం చెబుతాం’’ అని మమత బెనర్జీ అన్నారు.


‘‘కార్యక్రమంలో ప్రచారం మొత్తం ‘ఛీ ఛీ’ నినాదాలతో ఉంటుంది. పౌరసత్వ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని, జాతీయ జనాభా పట్టికను ఉపసంహరించుకోవాలని, జాతీయ పౌర పట్టికను రద్దు చేయాలని ఈ కార్యక్రమంలో పేర్కొంటాం. దేశాన్ని విడదీయాలనుకునే వారికి ఈ దేశంలో స్థానం లేదు’’ అని మమత ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2020-03-05T02:01:58+05:30 IST