వ్యభిచార కేసులో టీఎంసీ ప్రెసిడెంట్ అరెస్ట్

ABN , First Publish Date - 2020-03-05T02:19:23+05:30 IST

సదరు కేసులో అరెస్ట్ చేసిన వారితో ఓ వ్యక్తి తాను రాష్ట్ర టీఎంసీ అధ్యక్షుడినని చెప్పారని పేర్కొన్నారు. ఆయన విజిటింగ్ కార్డు రికవరీ చేసుకుని చూడా సచిన్ సింగ్ చౌహాన్ అని రాసి ఉందని, దాని కింది భాగంలో టీఎంసీ రాష్ట్ర అధ్యక్షుడు అని ఉందని భావ్‌నర్ తెలిపారు.

వ్యభిచార కేసులో టీఎంసీ ప్రెసిడెంట్ అరెస్ట్

భోపాల్: మధ్య ప్రదేశ్ రాష్ట్ర తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షుడు సచిన్ సింగ్ చౌహాన్ సహా మరో పది మందిని స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఓ వ్యభిచార కేసులో వీరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. క్రైం బ్రాంచ్ డీఎస్పీ అదితి భావ్‌నర్ తెలిపిన వివరాల ప్రకారం.. సదరు కేసులో అరెస్ట్ చేసిన వారితో ఓ వ్యక్తి తాను రాష్ట్ర టీఎంసీ అధ్యక్షుడినని చెప్పారని పేర్కొన్నారు. ఆయన విజిటింగ్ కార్డు రికవరీ చేసుకుని చూడా సచిన్ సింగ్ చౌహాన్ అని రాసి ఉందని, దాని కింది భాగంలో టీఎంసీ రాష్ట్ర అధ్యక్షుడు అని ఉందని భావ్‌నర్ తెలిపారు.


బర్ఖేడి ప్రాంతంలో వ్యభిచార కార్యకలాపాలు జరుగుతున్నాయని రాష్ట్ర పోలీసు డైరెక్టర్ ఫిర్యాదు అందుకున్న వెంటనే ప్రత్యేక బృందం అక్కడ రైడ్ చేసింది. ఆ సమయంలో వీరంతా పట్టుబడ్డట్లు పోలీసులు పేర్కొన్నారు.

Updated Date - 2020-03-05T02:19:23+05:30 IST