గవర్నర్ ధన్కర్‌ను తప్పించాలంటూ రాష్ట్రపతికి తృణమూల్ లేఖ

ABN , First Publish Date - 2020-12-30T19:19:19+05:30 IST

గవర్నర్ ధన్కర్‌ను వెంటనే పదవి నుంచి తప్పించాలంటూ అధికార తృణమూల్ కాంగ్రెస్ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ను కోరింది. ఈ మేరకు

గవర్నర్ ధన్కర్‌ను తప్పించాలంటూ రాష్ట్రపతికి తృణమూల్ లేఖ

బెంగాల్ : గవర్నర్ ధన్కర్‌ను వెంటనే పదవి నుంచి తప్పించాలంటూ అధికార తృణమూల్ కాంగ్రెస్ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ను కోరింది. ఈ మేరకు తృణమూల్ నేత సుఖేందు శేఖర్ రాయ్ ఓ లేఖ రాశారు. గవర్నర్ ధన్కర్ ప్రతిసారి సర్కార్‌తో గొడవలకు దిగుతున్నారని ఆయన లేఖలో ఫిర్యాదు చేశారు. రాజ్యాంగాన్ని రక్షించడంలో గవర్నర్ పదే పదే విఫలమవుతున్నారని, అలాగే సుప్రీం సూచించిన సూచనలనూ పాటించడం లేదని తృణమూల్ మండిపడింది. 


Updated Date - 2020-12-30T19:19:19+05:30 IST