అమిత్‌షా వ్యాఖ్యలకు ఘాటు కౌంటర్ ఇచ్చిన తృణమూల్

ABN , First Publish Date - 2020-12-19T23:14:10+05:30 IST

కాంగ్రెస్‌ నుంచి మమతా బెనర్జీని బహిష్కరించిన తర్వాత మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ అనే కొత్త పార్టీని స్థాపించారని, కాంగ్రెస్

అమిత్‌షా వ్యాఖ్యలకు ఘాటు కౌంటర్ ఇచ్చిన తృణమూల్

కోల్‌కతా : కాంగ్రెస్‌ నుంచి మమతా బెనర్జీని బహిష్కరించిన తర్వాత మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ అనే కొత్త పార్టీని స్థాపించారని, కాంగ్రెస్ నుంచి తప్పుకోలేదని, ఆ విషయం కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు తెలియదని తృణమూల్ ఎద్దేవా చేసింది. ఇతర పార్టీల నుంచి నేతలను బీజేపీ చేర్చుకుంటోందని మమతా అంటున్నారని, మమత కాంగ్రెస్‌ను వదిలి, తృణమూల్ ను ఏర్పాటు చేయలేదా? అని సూటిగా అడుతున్నాను అన్న అమిత్‌షా వ్యాఖ్యలకు కౌంటర్ గా తృణమూల్ పై వ్యాఖ్యలు చేసింది. తృణమూల్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ మాట్లాడుతూ... బెంగాల్ రాజకీయ చరిత్ర గురించి అమిత్‌షాకు ఏమాత్రం తెలియదని మండిపడ్డారు. మమతా బెనర్జీని కాంగ్రెస్‌ బహిష్కరించిన తర్వాత ఆమె కొత్త పార్టీని స్థాపించారని, ఈ విషయం అమిత్‌షాకు తెలియదన్నారు. కుటుంబ రాజకీయాల గురించి షా ప్రతిసారీ విరుచుకుపడుతుంటారని, కానీ సుబేందు అధికారి దగ్గరికి వచ్చే సరికి మాత్రం ఆ విమర్శను మరిచిపోతారని మండిపడ్డారు. షా కుమారుడికి బీసీసీఐలో పదవి దక్కిందని గుర్తు చేస్తూ కల్యాణ్ బెనర్జీ చురకలంటించారు. మమత కుటుంబం నుంచి ఎవరికీ ముఖ్యమంత్రి పదవి లభించదని, ఈ సంగతి బెంగాల్ ప్రజలకు బాగా తెలుసని అన్నారు. సుబేందు అధికారి నిజంగానే పెద్ద నేత అయితే, 1996,2001,2004 లో జరిగిన ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారో చెప్పారని కల్యాణ్ ప్రశ్నించారు. 

Updated Date - 2020-12-19T23:14:10+05:30 IST