బీజేపీ ఎంపీలు టచ్‌లో ఉన్నారు: టీఎంసీ రివర్స్ గేమ్

ABN , First Publish Date - 2020-11-23T02:01:33+05:30 IST

బీజేపీ ఎంపీలు టచ్‌లో ఉన్నారు: టీఎంసీ రివర్స్ గేమ్

బీజేపీ ఎంపీలు టచ్‌లో ఉన్నారు: టీఎంసీ రివర్స్ గేమ్

కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ నేతలను తమవైపుకు లాక్కుందామని చూస్తున్న భారతీయ జనతా పార్టీకి గట్టి ఎదురు దెబ్బే తగిలింది. బీజేపీకి చెందిన నలుగురు సిట్టింగ్ ఎంపీలు తమతో టచ్‌లో ఉన్నట్లు టీఎంసీ ప్రకటించింది. ఈ మధ్యే టీఎంసీని వీడిన సౌగతా రాయ్ సహా పలువురు టీఎంసీ నేతలు బీజేపీలో చేరనున్నట్లు బెంగాల్ రాజకీయాల్లో పెద్ద చర్చ నడుస్తున్న తరుణంలో టీఎంసీ తాజా బాంబు పేల్చింది. టీఎంసీ చెప్పినట్లుగానే నలుగురు బీజేపీ ఎంపీలు టీఎంసీలో చేరితే.. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వద్దామనుకుంటున్న బీజేపీకి ఆశలపై నీళ్లు చల్లినట్టే.


‘‘సౌగతారాయ్ సహా ఇంకొంత మంది వేరే పార్టీలో చేరుతున్నారని కొందరు ప్రచారం చేస్తున్నారు. సౌగతా బాబు సీనియర్ ఎంపీ. ఆయన కాదు.. నిజానికి బీజేపీకి చెందిన నలుగురు ఎంపీలు మాతో టచ్‌లో ఉన్నారు. బీజేపీలో వారికి ప్రాధాన్యత లేదు. అంతే కాకుండా ఆ పార్టీ నాయకత్వంపై వ్యవహారశైలిపై వారు చాలా అసంతృప్తితో ఉన్నారు. ఏమో, కొద్ది రోజుల్లో వారు టీఎంసీ కండువా కప్పుకోవచ్చు’’ అని టీఎంసీ నేత కునాల్ ఘోష్ అన్నారు.

Updated Date - 2020-11-23T02:01:33+05:30 IST