అమెరికా కంపెనీ చేతుల్లోకి టిక్‌టాక్..?

ABN , First Publish Date - 2020-07-19T17:34:57+05:30 IST

ప్రపంచ వ్యాప్తంగా చైనాపై వ్యక్తమవుతున్న వ్యతిరేకత టిక్‌టాక్‌పై ప్రతికూల ప్రభావం చూపించింది. భద్రతా కారణాల రీత్యా భారత్ ఇప్పటికే ఈ యాప్‌ను నిషేధించింది. అమెరికాతో పాటూ ఇతర దేశాల్లోనూ ఇదే తరహా చర్య తీసుకోవాలన్న డిమాండ్ బలపడుతోంది. చైనా ప్రభుత్వంతో తమకు ఎటువంటి సంబంధం ఉండదని టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌ ఇప్పటికే పలుమార్లు ప్రకటించినప్పటికీ పరిస్థితిలో మార్పు రావడంలేదు. ఈ నేపథ్యంలో వైట్ హౌస్ ఆర్థిక సలహాదారు ల్యారీ కుడ్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అమెరికా కంపెనీ చేతుల్లోకి టిక్‌టాక్..?

వాషింగ్టన్: ప్రపంచ వ్యాప్తంగా చైనాపై వ్యక్తమవుతున్న వ్యతిరేకత టిక్‌టాక్‌పై ప్రతికూల ప్రభావం చూపించింది. భద్రతా కారణాల రీత్యా భారత్ ఇప్పటికే ఈ యాప్‌ను నిషేధించింది. అమెరికాతో పాటూ ఇతర దేశాల్లోనూ ఇదే తరహా చర్య తీసుకోవాలన్న డిమాండ్ బలపడుతోంది. చైనా ప్రభుత్వంతో తమకు ఎటువంటి సంబంధం ఉండదని టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌ ఇప్పటికే పలుమార్లు ప్రకటించినప్పటికీ పరిస్థితిలో మార్పు రావడంలేదు. ఈ నేపథ్యంలో వైట్ హౌస్ ఆర్థిక సలహాదారు ల్యారీ కుడ్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


తన మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ నుంచి టిక్ టాక్ విడివడి అమెరికా కంపెనీగా సేవలు కొనసాగించే అవకాశం ఉందని ల్యారీ వ్యాఖ్యానించారు. అయితే అమెరికా కంపెనీలు టిక్‌టాక్‌ను చేజిక్కించుకోనున్నాయా అని విలేకరులు ప్రశ్నించగా.. సమాధానం చెప్పేందుకు ఆయన విముఖత వ్యక్తం చేశారు. మరోవైపు.. అమెరికాలోనూ టిక్‌టాక్‌ను నిషేధించే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు అమెరికా సెక్రెటరీ ఆఫ్ స్టేట్ మైక్‌పాంపియో ఇప్పటికే ప్రకటించారు. దీంతో టిక్‌టాక్ భవితవ్యంపై మరోసారి సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది.


Updated Date - 2020-07-19T17:34:57+05:30 IST