టిక్‌టాక్‌పై ఫ్రాన్స్ విచారణ..

ABN , First Publish Date - 2020-08-12T03:14:56+05:30 IST

టిక్‌టాక్‌పై ఫ్రాన్స్‌లో దర్యాప్తు ప్రారంభమైంది. సమాచార గోప్యతకు సంబంధించి వచ్చిన ఫిర్యాదు ఆధారంగా.. ఫ్రాన్స్‌కు చెందిన ప్రభుత్వ సంస్థ సీఎన్‌ఐఎల్ దర్యాప్తు ప్రారంభించింది.

టిక్‌టాక్‌పై ఫ్రాన్స్ విచారణ..

ప్యారిస్: టిక్‌టాక్‌పై ఫ్రాన్స్‌లో దర్యాప్తు ప్రారంభమైంది. సమాచార గోప్యతకు సంబంధించి వచ్చిన ఫిర్యాదు ఆధారంగా.. ఫ్రాన్స్‌కు  చెందిన ప్రభుత్వ సంస్థ సీఎన్‌ఐఎల్ దర్యాప్తు ప్రారంభించింది. ఐరోపా సమాఖ్యలో ప్రధాన కార్యాలయ్యాన్ని ఏర్పాటు చేసేందుకు టిక్‌టాక్ ప్రయత్నిస్తున్న సమయంలోనే ఫ్రాన్స్ ఈ విచారణకు తెరలేపింది. వినియోగదారులతో సమాచారాన్ని ఏ విధంగా ఇచ్చిపుచ్చుకుంటుంది, ఈ ఫ్లాట్‌ఫామ్‌ పిల్లల వినియోగానికి సురక్షితమైనదేనా అనే అంశాలను సీఎన్ఐఎల్ పరీశీలించనుంది. అయితే టిక్‌టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్ మాత్రం ఈ పరిణామంపై ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. ఇక ఐర్‌ల్యాండ్‌లో టిక్‌టాక్ తన ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే.. ఐరోపా సమాఖ్య నిబంధనలకు కట్టుబడి ఉండగలమని టిక్‌టాక్ నిరూపించుకోవాల్సి ఉంటుందని సీఎన్ఐఎల్ స్పష్టం చేసింది. 

Updated Date - 2020-08-12T03:14:56+05:30 IST