కరోనాపై పోరుకు టిక్‌టాక్ భారీ సాయం
ABN , First Publish Date - 2020-04-02T01:06:48+05:30 IST
చైనాకు చెందిన సామాజిక మాద్యమం టిక్‌టాక్.. కరోనాపై పోరాటానికి భారత్‌కు భారీ విరాళం ప్రకటించింది. 100 కోట్ల రూపాయలతో సుమారు 4 లక్షల సేఫ్‌టీ సూట్లను భారత్‌కు అందించనున్నట్లు టిక్‌టాక్ పేర్కొంది

న్యూఢిల్లీ: చైనాకు చెందిన సామాజిక మాద్యమం టిక్‌టాక్.. కరోనాపై పోరాటానికి భారత్‌కు భారీ విరాళం ప్రకటించింది. 100 కోట్ల రూపాయలతో సుమారు 4 లక్షల సేఫ్‌టీ సూట్లను భారత్‌కు అందించనున్నట్లు టిక్‌టాక్ పేర్కొంది. ఆలస్యంగానే అయినప్పటికీ దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టిక్‌టాక్ ముందుకు వచ్చి తన ఔదార్యాన్ని చాటుకుంది. భారత ప్రభుత్వానికి రాసిన లేఖలో సోషల్ మీడియా దిగ్గజమైన టాక్‌టాక్ పై విషయాన్ని స్పష్టం చేసింది.
కాగా ఇప్పటికే 20,675 సూట్లను మొదటి విడత కింద భారత్‌కు పంపించినట్లు 1,80,375 సూట్లను ఈ శనివారం నాటికి పింపిస్తామని టిక్‌టాక్ యాజమాన్యం పేర్కొంది. మిగతా 2,00,000 సూట్లను రాబోయే రోజుల్లో అందిస్తామని తెలిపారు. ఇదే విషయమై కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి టిక్‌టాక్ ఇండియా చీఫ్ నిఖిల్ గాంధీ లేఖ రాశారు. ప్రస్తుతం ఇండియా సేఫ్‌టీ సూట్ల కొరతలో ఉందని అందుకే తాము వాటిని అందించాలని నిర్ణయించుకున్నామని నిఖిల్ గాంధీ పేర్కొన్నారు.