కశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

ABN , First Publish Date - 2020-10-08T07:54:53+05:30 IST

జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. జైనాపొరా ప్రాంతంలోని సుగాన్‌ గ్రామంలో ఉగ్రవాదులు దాక్కొన్నారని సమాచారం అందడంతో బలగాలు మంగళవారం రాత్రి గాలింపు చర్యలు చేపట్టాయి...

కశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్‌, అక్టోబరు 7: జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. జైనాపొరా ప్రాంతంలోని సుగాన్‌ గ్రామంలో ఉగ్రవాదులు దాక్కొన్నారని సమాచారం అందడంతో బలగాలు మంగళవారం రాత్రి గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో బలగాలపై ముష్కరులు కాల్పులు జరిపారు. బలగాలు కూడా ఎదురుకాల్పులు జరిపాయి. బుధవారం ఉదయం వరకు ఇరు పక్షాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారని అధికారులు తెలిపారు. వారిని గుర్తించాల్సి ఉందని చెప్పారు.

Updated Date - 2020-10-08T07:54:53+05:30 IST