వుహాన్ ల్యాబ్‌లో మూడు జాతుల గబ్బిలాల కరోనా వైరస్... సంచలనం

ABN , First Publish Date - 2020-05-24T22:27:27+05:30 IST

వుహాన్ నగరంలోని మార్కెట్‌లో కిందటి డిసెంబరులో తొలిసారిగా వెలుగుచూసిన ప్రాణాంతక కరోనా వైరస్... అక్కడ నుంచి అన్ని దేశాలకూ విస్తరించింది. ఈ వైరస్‌ను వుహాన్ వైరాలజీ ల్యాబ్‌లోనే జన్యుపరంగా తయారుచేశారని అమెరికా సహా పలు దేశాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వుహాన్ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వుహాన్ ల్యాబ్‌లో మూడు జాతుల గబ్బిలాల కరోనా వైరస్... సంచలనం

వుహాన్ : వుహాన్ నగరంలోని మార్కెట్‌లో కిందటి డిసెంబరులో తొలిసారిగా వెలుగుచూసిన ప్రాణాంతక కరోనా వైరస్... అక్కడ నుంచి అన్ని దేశాలకూ విస్తరించింది. ఈ వైరస్‌ను వుహాన్ వైరాలజీ ల్యాబ్‌లోనే జన్యుపరంగా తయారుచేశారని అమెరికా సహా పలు దేశాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వుహాన్ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


‘ప్రస్తుతం మా ల్యాబ్‌లో మూడు జాతులకు చెందిన గబ్బిలాల కరోనావైరస్ ఉంది. కానీ, ప్రపంచవ్యాప్తంగా గందరగోళానికి గురిచేస్తున్న సార్స్-కోవి2తో ఏదీ సరిపోలడం లేదు’ అని ఆయన పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 3.50 లక్షల మందిని పొట్టనబెట్టుకున్న కరోనా వైరస్... తొలిసారి గబ్బిలాల నుంచి ఇతర క్షీరదాల ద్వారా మనుషులకు సంక్రమించినట్టు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.


వుహాన్ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ వాంగ్ యాన్‌యీ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... కరోనా వైరస్ చైనా ల్యాబ్ నుంచే వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా పలువరు ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇది అభూతకల్పన మాత్రమేనని పేర్కొన్నారు. గబ్బిలాల నుంచి కరోనా వైరస్ వేరుచేసి సేకరించినట్టు తెలిపారు. ప్రస్తుతం తమ వద్ద మూడు జాతుల కరోనా వైరస్‌లు కలిగి ఉన్నామని, 


ప్రొఫెసర్ షీ జంగ్లీ నేతృత్వంలోని బృందం 2004 నుంచి గబ్బిలాల్లో కరోనా వైరస్ గురించి పరిశోధన చేస్తోందని, దాదాపు రెండు దశాబ్దాల కిందట చైనాలో వ్యాపించిన సార్స్ వైరస్ మూలాలను గుర్తించడంపై దృష్టిసారించామని అన్నారు. సార్స్-కోవ్-2 మొత్తం జన్యువులు సార్స్‌తో 80 శాతం మాత్రమే పొలి ఉన్నాయని, రెండింటి మధ్య స్పష్టమైన తేడా ఉందనే విషయం తమకు తెలుసని అన్నారు. కాబట్టి, ప్రొఫెసర్ షి జెంగ్ బృందం గత పరిశోధనలో సార్స్ వైరస్‌తో సమానమైన వైరస్‌లనై దృష్టి పెట్టలేదని పేర్కొన్నారు.


Updated Date - 2020-05-24T22:27:27+05:30 IST