సరిహద్దుల్లో భారత ఆర్మీ కాల్పులు..ముగ్గురు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల మృతి
ABN , First Publish Date - 2020-06-01T16:43:46+05:30 IST
జమ్మూకశ్మీర్ లోని పాక్ సరిహద్దుల్లో భారత సైన్యం జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు....
రాజౌరీ (జమ్మూకశ్మీర్): జమ్మూకశ్మీర్ లోని పాక్ సరిహద్దుల్లో భారత సైన్యం జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. పాకిస్థాన్‌లో శిక్షణ పొందిన ముగ్గురు ఉగ్రవాదులు భారతదేశంలోకి నౌషెరా సెక్టారు మీదుగా నియంత్రణ రేఖ దాటి చొరబడుతుండగా భారత సైన్యం వారిపై కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ముగ్గురు పాక్ ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ వద్ద భారత సైనికులు ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు. పాక్ లో ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి వారిని భారతదేశంలోకి చొరబడేలా చేస్తున్న పాక్ యుక్తులను భారత సైన్యం వమ్ము చేసింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు పుల్వామాలో మందుగుండు సామాగ్రి పేల్చివేతకు చేసిన యత్నాన్ని సీఆర్ పీఎఫ్ అడ్డుకుంది.