కశ్మీర్‌లో పీడీపీకి మరో ముగ్గురు రాజీనామా

ABN , First Publish Date - 2020-11-27T08:03:15+05:30 IST

కశ్మీరులో.. మెహబూబా ముఫ్తీ సారధ్యంలోని పీపుల్స్‌ డెమాక్రటిక్‌ పార్టీ(పీడీపీ)కి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ముగ్గురు సీనియర్‌ నేతలు..

కశ్మీర్‌లో పీడీపీకి మరో ముగ్గురు రాజీనామా

శ్రీనగర్‌, నవంబరు 26: కశ్మీరులో.. మెహబూబా ముఫ్తీ సారధ్యంలోని పీపుల్స్‌ డెమాక్రటిక్‌ పార్టీ(పీడీపీ)కి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ముగ్గురు సీనియర్‌ నేతలు.. ధమన్‌ భాసిన్‌, ఫల్లైల్‌ సింగ్‌, ప్రీతమ్‌ కొత్వాల్‌.. ఆ పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు. నైతిక విలువలు, నిజాయితీ కోల్పోయి మతపరమైన అంశాలకు లొంగిపోయిన పీడీపీని విడిచిపెట్టడం తప్ప తమకు వేరే మార్గం లేదని వారి రాజీనామా లేఖలో పేర్కొన్నారు.  పార్టీ వ్య వస్థాకుడు నిర్దేశించిన ప్రాథమిక సూత్రాలకు వ్యతిరేకంగా పార్టీ ఇటీవల రెచ్చగొట్టే, వివాదాస్పద ప్రకటనలు చేసిందన్నారు. జాతీయ పతాకంపై ము ఫ్తీ వ్యాఖ్యలు, ఆమె వైఖరితో పార్టీ నుంచి బయటకు వచ్చిన వారెవరూ ఏకీభవించరని ప్రీతమ్‌ అన్నారు. దేశభక్తుల మనోభావాలను దెబ్బతీసేలా మె హబూబా ముఫ్తీ చేస్తున్న వ్యాఖ్యలు మనోవేదనకు గురి చేసేలా ఉంటున్నాయని ఆ పార్టీకి ఇప్పటికే రాజీనామా చేసిన మాజీ ఎంపీ టీఎస్‌ బాజ్వా అన్నారు. కాగా, ఈ నెల 28 నుంచి జమ్ముకశ్మీర్‌లో జిల్లా అభివృద్ధి మండళ్ల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజీనామాలు చర్చనీయాంశమయ్యాయి.

Read more