రేపు భారత్‌కు మరో మూడు రాఫెల్ యుద్ధ విమానాలు
ABN , First Publish Date - 2020-11-04T05:28:05+05:30 IST
రేపు సాయంత్రానికల్లా భారత్‌కు మరో మూడు రాఫెల్ యుద్ధ విమానాలు రానున్నాయి...
న్యూఢిల్లీ: భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత వైమానిక దళం (ఐఏఎఫ్) సామర్థ్యాన్ని మరింత ఇనుమడింపజేసేలా మరో మూడు కొత్త రాఫెల్ యుద్ధ విమానాలు అందుబాటులోకి రానున్నాయి. బుధవారం సాయంత్రానికల్లా ఈ మూడు విమానాలు దేశానికి చేరుకుంటాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు మీడియాకు వెల్లడించాయి. రేపు ఉదయం విమానాలు ఫ్రాన్స్‌లో బయల్దేరతాయనీ.. సాయంత్రానికల్లా ఇక్కడికి చేరకుంటాయని సమాచారం. శత్రుమూకలు కయ్యానికి కాలుదువ్వుతున్న ప్రదేశాల్లో ఇప్పటికే రాఫెల్ యుద్ధవిమానాలను రంగంలోకి దించుతున్న భారత్‌కు.. కొత్త విమానాలు మరింత బలం చేకూర్చుతాయని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది జూలైన 5 రాఫెల్ విమానాలతో కూడిన తొలి బ్యాచ్ భారత్‌కు వచ్చింది. సెప్టెంబర్ 10 మోదీ ప్రభుత్వం వాటిని భారత వాయుసేనలో ప్రవేశపెట్టింది.