ఇజ్రాయెల్‌లో 15కు చేరిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-03-04T15:55:25+05:30 IST

ఇజ్రాయెల్‌లో మరో ముగ్గురు వ్యక్తులకు కరోనావైరస్ (కోవిడ్-19) సోకినట్టు గుర్తించారు. దీంతో ఈ మధ్యప్రాచ్య...

ఇజ్రాయెల్‌లో 15కు చేరిన కరోనా కేసులు

జెరూసలేం: ఇజ్రాయెల్‌లో మరో ముగ్గురు వ్యక్తులకు కరోనావైరస్ (కోవిడ్-19) సోకినట్టు గుర్తించారు. దీంతో ఈ మధ్యప్రాచ్య దేశంలో కరోనా కేసుల సంఖ్య 15కు చేరింది. ఈ మేరకు ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. కరోనా బారిన పడిన వ్యక్తుల్లో ఓ పేషెంట్ గత నెల 29న ఇటలీ నుంచి తిరిగి వచ్చాడని ఆరోగ్య శాఖ వెల్లడించింది.  ప్రస్తుతం ముగ్గురినీ ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నట్టు పేర్కొంది. కాగా  చైనా వెలుపల కొత్తగా మరో 1700 పైగా నోవెల్ కరోనావైరస్ (కొవిడ్-19) కేసులు నమోదైనట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించిన సంగతి తెలిసిందే.  దీంతో చైనాయేతర దేశాల్లో ఈ మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య తాజాగా 10 వేలు దాటినట్టైంది. 

Updated Date - 2020-03-04T15:55:25+05:30 IST