షోపియాన్ జిల్లాలో మళ్లీ ఎన్‌కౌంటర్...ముగ్గురు ఉగ్రవాదుల హతం

ABN , First Publish Date - 2020-07-18T13:18:17+05:30 IST

జమ్మూకశ్మీర్ లోని షోపియాన్ జిల్లా అంషీపురా గ్రామంలో శనివారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటరులో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.....

షోపియాన్ జిల్లాలో మళ్లీ ఎన్‌కౌంటర్...ముగ్గురు ఉగ్రవాదుల హతం

శ్రీనగర్ (జమ్మూకశ్మీర్): జమ్మూకశ్మీర్ లోని షోపియాన్ జిల్లా అంషీపురా గ్రామంలో శనివారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటరులో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. అంషీపురా గ్రామంలో హిజ్బుల్ ముజాహిదీన్ కు చెందిన ఉగ్రవాదులున్నారనే సమాచారం మేర జమ్మూకశ్మీర్ పోలీసులు, సైనిక విభాగానికి చెందిన రాష్ట్రీయ రైఫిల్స్, సీఆర్ పీఎఫ్ జవాన్లు శనివారం ఉదయం గాలింపు చేపట్టారు. దాక్కున్న ఉగ్రవాదులు జవాన్లపైకి కాల్పులు జరపడంతో జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని జమ్మూకశ్మీర్ పోలీసులు చెప్పారు. గత 24 గంటల్లో జమ్మూకశ్మీర్ లో జరిగిన రెండో ఎన్ కౌంటర్ ఇది. శుక్రవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ముగ్గురు కమాండర్లు మరణించారు. దీంతో ఈ ఏడాది ఎదురుకాల్పుల్లో 133 మంది ఉగ్రవాదులు మరణించారు. 

Updated Date - 2020-07-18T13:18:17+05:30 IST