హుబ్బళ్లిలో ‘పాక్‌’ నినాదాలు

ABN , First Publish Date - 2020-02-16T08:11:14+05:30 IST

పుల్వామా దాడి జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా ‘పాకిస్థాన్‌ జిందాబాద్‌’ వీడియో కలకలం రేపింది. హుబ్బళ్లిలోని గోకుల రోడ్డులో ఉన్న కేఎల్‌ఈ ఇంజనీరింగ్‌ కళాశాలలో కశ్మీర్‌కు చెందిన విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో ముగ్గురు శుక్రవారం పాకిస్థాన్‌ జిందాబాద్‌ అంటూ

హుబ్బళ్లిలో ‘పాక్‌’ నినాదాలు

  • సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌
  • ముగ్గురు విద్యార్థుల సస్పెన్షన్‌..అరెస్టు 

బెంగళూరు, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): పుల్వామా దాడి జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా ‘పాకిస్థాన్‌ జిందాబాద్‌’ వీడియో  కలకలం రేపింది. హుబ్బళ్లిలోని గోకుల రోడ్డులో ఉన్న కేఎల్‌ఈ ఇంజనీరింగ్‌ కళాశాలలో కశ్మీర్‌కు చెందిన విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో ముగ్గురు శుక్రవారం పాకిస్థాన్‌ జిందాబాద్‌ అంటూ నినాదాలు చేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. వారిని అమీర్‌, బాసిత్‌, తాలీబ్‌గా గుర్తించారు. ఒకరు సివిల్‌ ఇంజనీరింగ్‌, ఇద్దరు కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థులు. శనివారం భజరంగ్‌దళ్‌ కార్యకర్తలు కళాశాలకు చేరుకుని ఆందోళన నిర్వహించారు. ఆ ముగ్గురిపై దేశద్రోహం కేసు నమోదు చేసి, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సెల్ఫీ వీడియో ఆధారంగా ముగ్గురినీ కళాశాల నుంచి సస్పెండ్‌ చేశామని, పోలీసులకూ ఫిర్యాదు చేశామని ప్రిన్సిపాల్‌ బసవరాజ్‌ అనామి చెప్పారు. ఆ ముగ్గురినీ అరెస్టు చేసినట్టు హుబ్లీ-దార్వాడ పోలీసు కమిషనర్‌ తెలిపారు. 

Updated Date - 2020-02-16T08:11:14+05:30 IST