హత్రాస్ ఘటనపై దర్యాప్తునకు ముగ్గురు సభ్యుల ప్యానల్

ABN , First Publish Date - 2020-09-30T16:26:07+05:30 IST

హత్రాస్‌లో 20 ఏళ్ల దళిత యువతిపై నలుగురు సామూహిక అత్యాచారం చేసి నాలుక కోసి హింసించిన ఘటనపై ముగ్గురు సభ్యులతో కూడిన ప్యానల్ ను నియమిస్తున్నట్లు...

హత్రాస్ ఘటనపై దర్యాప్తునకు ముగ్గురు సభ్యుల ప్యానల్

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడి

లక్నో (ఉత్తరప్రదేశ్): హత్రాస్‌లో 20 ఏళ్ల దళిత యువతిపై నలుగురు సామూహిక అత్యాచారం చేసి నాలుక కోసి హింసించిన ఘటనపై ముగ్గురు సభ్యులతో కూడిన ప్యానల్ ను నియమిస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం ప్రకటించారు.ఈ కమిటీ దర్యాప్తు జరిపి ఏడు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని సీఎం ఆదేశించారు. హత్రాస్ కేసు దర్యాప్తునకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారు. నిర్భయ ఘటనను గుర్తుకు చేసేలా నలుగురు నిందితులు యువతిని హింసించి, అత్యాచారం జరిపి చంపారు. కుటుంబసభ్యులను ఇంట్లో తాళం వేసి, యువతి మృతదేహాన్ని పోలీసులు బలవంతంగా దహనం చేశారని స్థానికులు ఆరోపించారు.


నలుగురు నిందితులు జైలులో ఉన్నారు. కాగా బాధిత యవతిపై అత్యాచారం జరిపారని తేలలేదని, ఫోరెన్సిక్ నివేదికలో వాస్తవాలు వెలుగుచూస్తాయని ఓ సీనియర్ పోలీసు అధికారి చెప్పడం విమర్శలకు దారితీసింది. 

Updated Date - 2020-09-30T16:26:07+05:30 IST