జార్ఖండ్‌లో ముగ్గురు మావోయిస్టుల ఎన్‌కౌంటర్

ABN , First Publish Date - 2020-04-05T12:49:15+05:30 IST

జార్ఖండ్ రాష్ట్రంలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది.....

జార్ఖండ్‌లో ముగ్గురు మావోయిస్టుల ఎన్‌కౌంటర్

ఖుంటి (జార్ఖండ్): జార్ఖండ్ రాష్ట్రంలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఖుంటి -చాయబాసా సరిహద్దుల్లో మావోయిస్టులున్నారనే సమాచారం మేర  ఈ ఎన్‌కౌంటర్ సీఆర్‌పీఎఫ్ జవాన్లు జార్ఖండ్ సాయుధ పోలీసులతో కలిసి గాలింపు చేపట్టారు. ఈ సందర్భంగా మావోయిస్టులు సీఆర్‌పీఎఫ్ జవాన్లపై కాల్పులు ప్రారంభించగా, వారు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు మహిళా మావోయిస్టులు మరణించారు. మృతుల వద్ద నుంచి మూడు తుపాకులు, తూటాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని సీఆర్‌పీఎఫ్ సీనియర్ అధికారి చెప్పారు. 

Updated Date - 2020-04-05T12:49:15+05:30 IST