ఉత్తరాఖండ్ లో వరదలు...ముగ్గురి మృతి

ABN , First Publish Date - 2020-07-20T15:55:39+05:30 IST

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాలతో వరదలు వెల్లువెత్తడంతో ముగ్గురు మరణించారు.

ఉత్తరాఖండ్ లో వరదలు...ముగ్గురి మృతి

మరో 11 మంది గల్లంతు...గాలింపు

న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాలతో వరదలు వెల్లువెత్తడంతో ముగ్గురు మరణించారు. పితోరాఘడ్ జిల్లా మడ్ కట్ గ్రామంలో వరదనీటిలో మునిగి ముగ్గురు మరణించారు. వరదల్లో మరో 11 మంది గల్లంతయ్యారు. గల్లంతు అయిన వారి కోసం గాలిస్తున్నారు. మడ్ కట్ గ్రామంలో గల్లంతు అయిన వారికోసం గాలిస్తున్నామని పితోరాఘడ్ జిల్లా కలెక్టరు వీకే జోగదాండే చెప్పారు. 

Updated Date - 2020-07-20T15:55:39+05:30 IST