నిబంధనలకు నీళ్లు.. రామ్‌లీలాకు పోటెత్తిన జనం
ABN , First Publish Date - 2020-05-18T20:41:49+05:30 IST
ఉత్తరప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు మూడు శ్రామిక ప్రత్యేక రైళ్లు సోమవారం సాయంత్రం బయలుదేరుతున్నాయి. ఈ రైళ్లలో తమ పేర్లు..

ఘజియాబాద్: కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వాలు ప్రచారం సాగిస్తున్నా వాటికి జనం తూట్లు పొడుస్తున్న ఘటనలు అడపాదడపా చోటుచేసుకుంటున్నాయి. నిబంధనలకు భిన్నంగా వేలాది మంది వలస కార్మికులు మంగళవారంనాడు రామ్‌లీలా మైదానానికి పోటెత్తారు.
ఉత్తరప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు మూడు శ్రామిక ప్రత్యేక రైళ్లు సోమవారం సాయంత్రం బయలుదేరుతున్నాయి. ఈ రైళ్లలో తమ పేర్లు రిజిస్టర్ చేయించుకునేందుకు జనం వేలాదిగా రామ్‌లీలాకు తరలివచ్చారు. వీరిలో పలువురు కనీసం మాస్క్‌లు కూడా ధరించలేదు. లెక్కకు మిక్కిలిగా జనం అక్కడకు చేరుకోవడంతో వారిని అదుపుచేయడం పోలీసులకు సైతం కష్టమైంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజా సమాచారం ప్రకారం ఉత్తరప్రదేశ్‌లో 4,259 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.