మహారాష్ట్రలో 1,007 మంది పోలీసులకు కరోనా, ఎస్ఐ మృతి

ABN , First Publish Date - 2020-05-13T15:00:24+05:30 IST

దేశ ఆర్థిక రాజధాని నగరమైన ముంబైలో కరోనా వైరస్ వ్యాప్తి కలకలం రేపుతోంది....

మహారాష్ట్రలో 1,007 మంది పోలీసులకు కరోనా, ఎస్ఐ మృతి

ముంబై (మహారాష్ట్ర): దేశ ఆర్థిక రాజధాని నగరమైన ముంబైలో కరోనా వైరస్ వ్యాప్తి కలకలం రేపుతోంది. మహారాష్ట్రలో విధి నిర్వహణలో ఉన్న 1,007 మంది పోలీసులకు కరోనా వైరస్ సోకడంతో వారిని ఆసుపత్రులకు తరలించి క్వారంటైన్ చేశారు. 106 మంది పోలీసు అధికారులతో పాటు 901 మంది పోలీసుకానిస్టేబుళ్లకు కరోనా వైరస్ పాజిటివ్ అని పరీక్షల్లో తేలింది. ఒక్క ముంబై నగరంలోనే 394 మంది పోలీసులకు కరోనా వైరస్ సోకిందని తేలింది. బుధవారం కరోనా వైరస్ సోకి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పోలీసు సబ్ ఇన్‌స్పెక్టరు మరణించారు.

Read more