ఉద్యోగాలు పెరుగుతున్నా...

ABN , First Publish Date - 2020-08-12T00:15:29+05:30 IST

ఉద్యోగాలు పెరుగుతున్నాయి... కానీ ఆర్ధిక వ్యవస్థ మాత్రం కోలుకోవడంలేదు. కరోనా, లాక్ డౌన్ నేపధ్యంలో,.. భారీగా పెరిగిన నిరుద్యోగం... ఆ తర్వాత జూలై నాటికి కోలుకుంది. దాదాపు ప్రీ-లాక్ డౌన్ స్థాయికి చేరుకుంది. అయితే పునరుద్ధరణ తర్వాత... జాబ్ మార్కెట్‌లో ఎక్కువ భాగం... తక్కువ వేతనం ఉన్న అనధికారిక రంగానికే చెందినవి. మెరుగైన వేతనాలు ఉన్న ఉద్యోగా‌ల విషయానికి వస్తే పరిస్థితి మరింతగా దిగజారుతున్నట్లుగా కనిపిస్తోందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

ఉద్యోగాలు పెరుగుతున్నా...

న్యూఢిల్లీ : ఉద్యోగాలు పెరుగుతున్నాయి... కానీ ఆర్ధిక వ్యవస్థ మాత్రం కోలుకోవడంలేదు. కరోనా, లాక్ డౌన్ నేపధ్యంలో,.. భారీగా పెరిగిన నిరుద్యోగం... ఆ తర్వాత జూలై నాటికి కోలుకుంది. దాదాపు ప్రీ-లాక్ డౌన్ స్థాయికి చేరుకుంది. అయితే పునరుద్ధరణ తర్వాత... జాబ్ మార్కెట్‌లో ఎక్కువ భాగం... తక్కువ వేతనం ఉన్న అనధికారిక రంగానికే చెందినవి. మెరుగైన వేతనాలు ఉన్న ఉద్యోగా‌ల విషయానికి వస్తే పరిస్థితి మరింతగా దిగజారుతున్నట్లుగా కనిపిస్తోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 


ఆ ఉద్యోగాల కొరత... సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎంప్లాయ్‌మెంట్ డేటా ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్‌లో 12.5 మిలియన్ల ఉద్యోగాలు పోయాయి. మే నెలలో స్వల్పంగా కోలుకుంది. జూన్‌లో తగ్గింది. జూలైలో మరింత ఎక్కువగా కోలుకుంది. ఉద్యోగాలు లేని వారి సంఖ్య పదకొండు మిలియన్లకు చేరుకుంది.


గత మూడు నెలల్లో ఉద్యోగాల పునరుద్ధరణ వేగంగా జరిగింది. అయితే ఎక్కువ వేతనం ఉన్న ఉద్యోగాల పరిస్థితి ఇప్పటికీ ఆందోళనకరంగానే ఉన్నందున... ఇది వేగవంతమైన ఆర్థిక పునరుద్ధరణకు సంకేతంగా చెప్పలేమని అంటున్నారు. ఈ ఉద్యోగాల్లో పెరుగుదల కూడా కనిపించడం లేదని చెబుతున్నారు.


ఆందోళన కలిగించే అంశం... భారత జాబ్ రివైవల్ పరిస్థితి ఆందోళన కలిగించేదిగా ఉందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎంప్లాయ్‌మెంట్ ఎండీ, సీఈవో మహేష్ వ్యాస్ ఇటీవల  పేర్కొన్న విషయం తెలిసిందే. కారణం... ఆర్థిక వ్యవస్థకు కీలకమైన శాలరీ జాబ్స్ ఇంకా కోలుకోలేదని, అసంఘటిత ఉద్యోగాలతో సమానంగా కోలుకోలేదని ఆయన పేర్కొన్నారు.


లాక్ డౌన్ తర్వాత వేతన ఉద్యోగుల పరిస్థితి దిగజారిందని, ఏప్రిల్ నెలలో 17.7 మిలియన్‌లకు పైగా వేతన ఉద్యోగులు ఉద్యోగాలను కోల్పోయారని, జూలైలో ఈ సంఖ్య 19 మిలియన్లకు పెరిగిందని వెల్లడించారు. 


Updated Date - 2020-08-12T00:15:29+05:30 IST