నా భవిష్యత్తుపై అత్యాచారం: కంగనా ట్వీట్

ABN , First Publish Date - 2020-09-17T22:01:35+05:30 IST

నా భవిష్యత్తుపై అత్యాచారం: కంగనా ట్వీట్

నా భవిష్యత్తుపై అత్యాచారం: కంగనా ట్వీట్

ముంబై: బాలీవుడ్ హీరోయిన్ నటి కంగనా రనౌత్ ట్వీట్టర్ వేదికగా మహారాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బీఎంసీ కూల్చివేసిన తన భవనంలోని కొన్ని ఫోటోలను నటి కంగనా రనౌత్ ట్వీట్ చేసింది. ఇది నా కలలు, నా ఆత్మలు, నా ఆత్మగౌరవం, నా భవిష్యత్తుపై అత్యాచారం" అని కంగనా ట్వీట్ చేసింది. ఇది అత్యాచారం కాదా? ఆమె ప్రశ్నించారు. "ఒకప్పుడు దేవాలయం స్మశానవాటికగా మార్చబడిందని, అవి నా కలలను ఎలా విరిచాయో చూడండి? అంటూ కంగనా రనౌత్ ట్విట్టర్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేసింది.


బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ మృతి కేసుపై ముంబై పోలీసుల దర్యాప్తు పట్ల తనకు విశ్వాసం లేదని కంగనా ప్రకటించడంతో వివాదం మొదలైన సంగతి తెలిసిందే. ముంబై పోలీసులపై నమ్మకం లేకుంటే నగరంలో ఉండరాదని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ చేసిన వ్యాఖ్యలతో బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌, శివసేనల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. సంజయ్‌ రౌత్‌ తనను బెదిరించారని అంటూ ముంబైని పీఓకేతో కంగనా పోల్చడం కలకలం రేపింది.Updated Date - 2020-09-17T22:01:35+05:30 IST