ఈ బాలిక... దుండగులను మట్టి కరిపించింది

ABN , First Publish Date - 2020-09-04T01:33:03+05:30 IST

ఫోన్‌ను కొట్టేసి, పారిపోయేందుకు యత్నించిన ఇద్దరు దుండగులను ఓ పదిహేనేళ్ళ బాలిక మట్టికరిపించింది. రాడ్‌తో దాడి చేస్తున్నప్పటికీ... వీరోచితంగా పోరాడి మరీ పోలీసులకు పట్టించింది. పంజాబ్‌లోని జలంధర్‌‌కు సమీపంలోని కపుర్తలా రోడ్‌లో ఈ ఘటన జరిగింది. వివరాలిలా ఉన్నాయి.

ఈ బాలిక... దుండగులను మట్టి కరిపించింది

చంఢీగ‌ర్  : ఫోన్‌ను కొట్టేసి, పారిపోయేందుకు యత్నించిన ఇద్దరు దుండగులను ఓ పదిహేనేళ్ళ బాలిక మట్టికరిపించింది. రాడ్‌తో దాడి చేస్తున్నప్పటికీ... వీరోచితంగా పోరాడి మరీ పోలీసులకు పట్టించింది. పంజాబ్‌లోని జలంధర్‌‌కు సమీపంలోని కపుర్తలా రోడ్‌లో ఈ ఘటన జరిగింది. వివరాలిలా ఉన్నాయి.


హోమ్‌ ట్యూషన్‌ నుండి తిరిగి ఇంటికి వెళుతున్న కుసుమకుమారి అనే బాలిక నుంచి ఫోన్‌ను లాక్కునేందుకు బైక్‌పైవచ్చిన ఇద్దరు దుండగులు యత్నించారు. అయితే ఆ బాలిక... దుండగుడిని బైక్‌ ఎక్కకుండా అడ్డుకుంది. దీంతో దుండగుడు ఇనుప రాడ్‌తో బాలిక మణికట్టుపై దాడి చేశాడు. రాడ్‌తో దాడి చేస్తున్నప్పటికీ.. అతనిని బండి ఎక్కకుండా లాగి కింద పడేసింది.


అదే క్రమంలో... మరి కొందరు స్థానికుల సాయంతో దుండగుడిని పోలీసులకు అప్పగించింది. ప్రస్తుతం ఆ బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తాను దుండగులను చూసి భయపడలేదని, మూడు నెలల నుండి తైక్వాండోలో శిక్షణ పొందుతున్నానని ఆ బాలిక తెలిపింది. కాగా... కుసుమ కుమారి తండ్రి కార్మికుడి గాను, తల్లి గృహిణిగాను జీవనం సాగిస్తున్నారు.


దుండగుడిని అవినాష్‌ కుమార్‌(22)గా గుర్తించారు. మరో నిందితుని కోసం గాలిస్తున్నారు. కాగా... ఆ బాలిక ధైర్యసాహసాలకు గుర్తింపుగా డిసి ఘన్‌శ్యామ్‌ థోరి రూ. 51 వేల నగదు బహుమతిని ప్రకటించారు. అంతేకాదు... 'బేటీ బచావొ, బేటీ పడావో' కార్యక్రమానికి ప్రచార కర్తగా నియమించాలని జలంధర్‌ అధికారులు భావిస్తున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయి సాహస పురస్కారాలకు ఆమె పేరును సిఫారసు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

Updated Date - 2020-09-04T01:33:03+05:30 IST