తిరువనంతపురంలో లాక్‌డౌన్‌ జూలై 28 వరకూ పొడిగింపు

ABN , First Publish Date - 2020-07-19T05:30:00+05:30 IST

కేరళలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. కేరళలో ఆదివారం ఒక్కరోజే...

తిరువనంతపురంలో లాక్‌డౌన్‌ జూలై 28 వరకూ పొడిగింపు

తిరువనంతపురం: కేరళలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. కేరళలో ఆదివారం ఒక్కరోజే 821 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో.. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 7063కు చేరింది. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా కేరళ రాజధాని తిరువనంతపురంలో లాక్‌డౌన్‌ను జూలై 28 వరకూ పొడిగిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. తిరువనంతపురం కార్పొరేషన్ అంతటా ఆంక్షలతో కూడిన సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఇటీవల.. తిరువనంతపురంలోని తీర ప్రాంతాల్లో కరోనా సామాజిక వ్యాప్తి దశలోకి ఉందని.. స్వయంగా సీఎం పినరయ్ విజయన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.


తిరునంతపురంలోని రెండు ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రంగా ఉందని, పూన్తుర, పుల్లువిల ప్రాంతాల్లో కరోనా సామాజిక వ్యాప్తి జరిగిందని సీఎం చెప్పారు. పూన్తురలో 50 మందికి కరోనా ర్యాండమ్ టెస్టులు చేయగా 26 మందికి పాజిటివ్‌గా తేలిందని, పుల్లువిలలో 57 మందికి కరోనా టెస్టులు చేయగా... 28 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని సీఎం ప్రకటించారు. తీర ప్రాంతాల్లో సామాజిక వ్యాప్తి ఎక్కువగా ఉందని, ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు వీలైనన్ని ప్రయత్నాలు చేయాలని అధికారులకు సీఎం సూచించారు.Updated Date - 2020-07-19T05:30:00+05:30 IST