హాట్‌స్పాట్ల జాబితా నుంచి తిరువనంతపురం తొలగింపు

ABN , First Publish Date - 2020-04-28T22:28:22+05:30 IST

కేరళలో కోవిడ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. రాజధాని తిరువనంతపురంలో పాజిటివ్ కేసులు

హాట్‌స్పాట్ల జాబితా నుంచి తిరువనంతపురం తొలగింపు

తిరువనంతపురం: కేరళలో కోవిడ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. రాజధాని తిరువనంతపురంలో పాజిటివ్ కేసులు నమోదు కాకపోవడంతో నగరాన్ని హాట్‌స్పాట్ల జాబితా నుంచి తొలగించారు. అలాగే, అలప్పుజా, త్రిసూర్, వయనాడ్ జిల్లాల్లోనూ కేసులు నమోదు కాలేదు. కేరళ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. రాష్ట్రంలో ప్రస్తుతం 481 కరోనా నిర్ధారిత కేసులు నమోదు కాగా,  123 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. అలాగే, వివిధ జిల్లాల్లో 20,301 మంది నిఘాలో ఉండగా 19,812 మంది హోం క్వారంటైన్‌లో ఉన్నారు.


కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నప్పటికీ మే 15 వరకు పాక్షిక లాక్‌డౌన్ అమలు చేయడానికే పినరయి ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. ప్రవాసుల పునరావాసం సహా వివిధ రంగాలకు కేంద్రం నుంచి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని కోరినట్టు ముఖ్యమంత్రి పినరయి విజయన్ చెప్పారు. కాగా, దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 29,435 కరోనా వైరస్ కేసులు నమోదు కాగా, మృతుల సంఖ్య 934కు పెరిగింది. 

Updated Date - 2020-04-28T22:28:22+05:30 IST