తిరువనంతపురంలో లాక్‌డౌన్ మరోవారం పొడిగింపు

ABN , First Publish Date - 2020-07-11T01:51:23+05:30 IST

రాజధాని తిరువనంతపురంలో లాక్‌డౌన్‌ను మరోవారం పాటు పొడిగిస్తున్నట్టు కేరళ ముఖ్యమంత్రి పినరయి

తిరువనంతపురంలో లాక్‌డౌన్ మరోవారం పొడిగింపు

తిరువనంతపురం: రాజధాని తిరువనంతపురంలో లాక్‌డౌన్‌ను మరోవారం పాటు పొడిగిస్తున్నట్టు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. కంటైన్మెంట్ జోన్లు మాత్రం ట్రిపుల్ లాక్‌డౌన్‌లో ఉంటాయని చెప్పారు. ఈ నెల 6న విధించిన ట్రిపుల్ లాక్‌డౌన్ వారం పాటు మాత్రమే అమల్లో ఉండనుండగా, దానిని మరోవారం పాటు పెంచుతున్నట్టు సీఎం తాజాగా ప్రకటించారు. ట్రిపుల్ లాక్‌డౌన్ వ్యూహంలో భాగంగా ఫస్ట్ లాక్‌డౌన్‌లో ప్రజల కదలికలను గమనిస్తారు. నిత్యావసర సరుకుల రవాణాకు మాత్రమే ప్రైవేటు వాహనాలను అనుమతిస్తారు. సెకండ్ లాక్‌డౌన్‌లో కంటెన్మైంట్ జోన్లలో కేసులు వెలుగు చూసిన ప్రాంతాలను కట్టడి చేస్తారు. కరోనా సోకిన వ్యక్తి ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను పర్యవేక్షిస్తారు. థర్డ్ లాక్‌డౌన్‌లో ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌ల గృహాలను పర్యవేక్షిస్తారు. ఏప్రిల్‌లో కసరగడ్ జిల్లాలో అమలు చేసిన ‘ట్రిపుల్ లాక్‌డౌన్’ వ్యూహం విజయవంతమైంది. మూడు వారాల్లోనే 94 శాతం కేసులు తగ్గుముఖం పట్టాయి.   

Updated Date - 2020-07-11T01:51:23+05:30 IST