బద్ధలవబోతున్న అగ్నిపర్వతంపై తిరువనంతపురం: మంత్రి

ABN , First Publish Date - 2020-07-06T04:42:13+05:30 IST

తిరువనంతపురం జిల్లాలో కరోన వైరస్ కేసులు పెరుగుతుండటంపై...

బద్ధలవబోతున్న అగ్నిపర్వతంపై తిరువనంతపురం: మంత్రి

కేరళ: తిరువనంతపురం జిల్లాలో కరోన వైరస్ కేసులు పెరుగుతుండటంపై కేరళ పర్యాటక మంత్రి కడకంపల్లి సురేంద్రన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తిరువనంతపురం జిల్లా పరిస్థితి బద్ధలవడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతంపై కూర్చున్నట్టుగా ఉందని మంత్రి వ్యాఖ్యానించారు. అది ఏ క్షణమైనా బద్ధలవ్వొచ్చని మంత్రి చెప్పారు. ఎందుకంటే.. సామాజిక వ్యాప్తి ఇప్పటికైతే లేదు కానీ.. దీని అర్థం మున్ముందు ఉండదని కాదని సురేంద్రన్ వ్యాఖ్యానించారు.


జిల్లాలో కంటైన్మెంట్ జోన్లలో ఆంక్షలను మరింత కఠినతరం చేశామని, ఫుడ్ డెలివరీ బాయ్స్‌నూ టెస్ట్ చేస్తున్నామని మంత్రి చెప్పారు. ఇటీవలే.. తిరువనంతపురం జిల్లాలో ఓ ఫుడ్ డెలివరీ బాయ్‌కు, పోలీస్‌కూ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. కేరళలో ఆదివారం కొత్తగా 225 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో.. కేరళలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,429కి చేరింది. ఇందులో యాక్టివ్ కేసుల సంఖ్య 2,228. తిరువనంతపురం జిల్లాలో కేసుల సంఖ్య 109కి చేరింది.

Updated Date - 2020-07-06T04:42:13+05:30 IST