రైతుల ఆందోళన పేరుతో నక్సల్స్‌: బీజేపీ నేత

ABN , First Publish Date - 2020-12-27T18:27:44+05:30 IST

రైతుల ఆందోళన పేరుతో నక్సల్స్‌: బీజేపీ నేత

రైతుల ఆందోళన పేరుతో నక్సల్స్‌: బీజేపీ నేత

న్యూఢిల్లీ: పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాల్లో రైతులు జియో మొబైల్ టవర్లకు కరెంట్ అందకుండా చేయడంపై భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అర్బన్ నక్సల్స్ ప్రభావం పెరిగిందని, రైతుల ఆందోళన పేరుతో నక్సల్స్‌ని వదులుతున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించడంలో కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అందుకే అర్బన్ నక్సల్స్ క్షేత్ర స్థాయిలో చెలరేగి పోతున్నారని ఆరోపించారు. ప్రస్తుం పంజాబ్ పరిస్థితి ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల మాదిరిగా మారిపోయిందని తరుణ్ చుగ్ విమర్శించారు.


‘‘పంజాబ్‌లో పరిస్థితి తీవ్ర స్థాయికి చేరింది. రోడ్లను దిగ్బంధించడం, రైళ్లను కదలకుండా అడ్డుకోవడం, టోల్ ప్లాజాల పని నిలిపివేయడం, టెలికమ్యూనికేషన్ వ్యవస్థలను ధ్వంసం చేయడం లాంటి సంఘటనలు రాష్ట్రంలో తరుచుగా జరుగుతున్నాయి. విధ్వంసకారులను అడ్డుకోవడంలో పోలీసులు విఫలమయ్యారు. శాంతిభద్రతలను అదుపులో ఉంచడంలో అమరీందర్ సింగ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఒకరకంగా చెప్పాలంటే రైతుల ఆందోళన పేరుతో రాష్ట్రంలో నక్సల్స్‌ని వదులుతున్నారు. ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోకుండా రాష్ట్రాన్ని రెడ్ కారిడార్‌లోకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి అనుకుంటున్నారా? ఇది పంజాబ్‌కు చాలా ప్రమాదకరం’’ అని తరుణ్ చుగ్ అన్నారు.

Updated Date - 2020-12-27T18:27:44+05:30 IST